ఓటరు నమోదు, సవరణ వినియోగంచుకోవాలి


Ens Balu
8
Rajamahendravaram
2022-09-03 06:29:51

భారత ఎన్నికల కమిషన్  ప్రత్యేక ముమ్మర సవరణ -2023 ను ప్రారంభించి యున్నందున ఓటర్లు స్వచ్ఛందంగా గానీ, బూత్ లెవల్ అధికారుల ద్వారా గానీ ఓటు నమోదు, సవరణ, పేరు చిరునామా మార్పు లకు సంబంధించి ధరఖాస్తు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్  డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఓటు నమోదు , మార్పులు చేర్పులు , తొలగింపులకు ww.nvsp.in మరియు www.voterportal.eci.in లేదా voters app  ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా లోని  ఓటర్లు ఈ క్రింది సూచనల ప్రకారం తెలుసుకుని బూత్ లెవెల్ అధికారులకు సంప్రదించి  తగిన మార్పులు చేర్పులు కోసం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాధవీలత కోరారు.

మీ ఓటర్ కార్డును మీ యొక్క ఆధార్ కార్డ్ కు లింకు చేయుట కొరకు , ప్రతి ఓటరుకు తన ఆధార్ కార్డ్ ను ఫారం- 6 బి ద్వారా అనుసంధానం చేయవలసి యున్నదని తెలియచేశారు. ఇందు కోసం మీ ప్రాంతం లోని బూత్ లెవెల్ అధికారులకు " GARUDA APP " ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ ఆగస్ట్ 1 వ తేదీన కేంద్ర ఎన్నికల కమీషన్ వారు ప్రవేశపెట్టి యున్నారు.  ఎవరికి వారు  ఓటర్లు స్వచ్ఛందంగా www.nvsp.in , www.voterportal.eci.in లేదా voters app నందు ఆధార్ లింకు చేసుకొనే వెసులు బాటు కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


కొత్త ఓటర్లు నమోదు కొరకు  01-01-2023 నాటికి 18 సం॥లు నిండే ప్రతి పౌరుడు ఓటు నమోదు చేసుకొనుటకు అవకాశం ఫామ్. 6 ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు.  ఓటు నమోదు ప్రక్రియను నిరంతరం కొనసాగే విధంగా ఏడాదికి నాలుగు సార్లు నమోదుకు అవకాశం కలుగ చెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు.  జనవరి 1 , ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సం.ములు నిండిన వారికి కూడా ముందస్తుగా ఓటు నమోదు కొరకు అవకాశం తద్వారా కల్పించినట్లు తెలిపారు. ఎన్ ఆర్ ఐ ఓటర్లు నమోదు కొరకు ఫారం 6బి , ఓటు తొలగించుట కొరకు ఫారం 7,  ఓటర్ కార్డు నందు మార్పుల కొరకు ఫారం 8 ( ఉదా : పేరు , లింగం , వయస్సు మరియు బంధుత్వంలో గల మార్పుల కొరకు ) నివాసం మార్పు కొరకు ( అసెంబ్లీ నియోజకవర్గం పరిధి లోపల / పరిధి దాటి)  ప్రత్యామ్నాయ ( డూప్లికేట్ ) ఓటర్ కార్డ్ కొరకు ఫారం 8 ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు.