ప్రణాళికాబద్దంగా విశాఖ నగరాభివ్రుద్ధి


Ens Balu
1
Visakhapatnam
2022-09-03 06:49:12

జీవిఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాలను, వార్డులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె 5వ జోన్ పరిధిలోని 49, 50 వార్డులలో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, స్థానిక కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, అల్లు శంకర్రావు తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో విశాఖ నగరంలో ఉన్న ప్రతి వార్డు నుంచి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 49 వ వార్డు లో సుమారు రూ. 49.90 లక్షల వ్యయంతో భూగర్భ మురుగునీటి పైపులైను పనులకు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అలాగే 50 వార్డులో సాయిరామ్ నగర్, సత్య నగర్, మాధవధార, వంశీ నగర్, నరసింహ నగర్ , మురళి నగర్ తదితర ప్రాంతాలలో సిసి రోడ్లు, సిసి కాలువ నిర్మాణానికి సుమారు రూ.115.50 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసామని తెలిపారు.

 అయ్యా  వార్డుల కార్పొరేటర్లు సమిష్టి కృషితో వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు ఈ వార్డుల్లో ఖర్చు పెట్టడం జరుగుతుందని  మేయర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సచివాలయం సెక్రటరీలు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.