కాకినాడ బీచ్ రోడ్ మార్గంలో వున్న విలువైన దుమ్ములపేట భూముల్లో పేదలకు పట్టాలు గృహనిర్మాణం పనులు సత్వరం చేపట్టకుండా గత ప్రభుత్వంలో శిలా ఫలకాలతో నిర్లక్ష్యం చేసారని.. పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్ల పూడి రమణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని కబ్జా చేయడానికి చేస్తున్న యత్నాలు గత ఏడాది నుండి జరగడం దురదృష్టకరమని.. 1983 లో ఎన్ టి ఆర్ ను కోరి మరీ తీసుకున్న అక్కడి భూమి మనిషి నిలువెత్తు లోతులో వుండగా వాటిని మెరక చేసుకోవడానికి అక్కడి మత్సకారుల కుటుంబా లకు పాతికేళ్ళు పట్టిందని పేర్కొన్నారు.. ఎన్ టి ఆర్ నగర్ గా ఆ ప్రాంతాన్ని నామకరణం చేసి పేదలకు ఇచ్చిన పట్టాలు కొనసాగించి ప్రభుత్వ గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
గత ఏడాది నుండి దుమ్ముల పేట స్థలంలో ఆర్ టి సి మార్కెట్ ఏర్పాటు అంటూ చేసిన కౌన్సిల్ ప్రతిపాదనలు వివాదా స్పదం కాగా ప్రజల నివాసం లేని చోట రు.50 లక్షలు నిధులు కేటాయించిన తీర్మానం వెనుక ఉద్దేశ్యపూర్వక ఎత్తుగడలువున్నాయ న్నారు. ప్రశాంత మైన నగరంలో కంచే చేను మేస్తున చందంగా జరుగుతున్న కబ్జాల సంస్కృతి పెరగకుండా రాజకీయ అలజడి సృష్టిస్తున్న ధోరణి ప్రభలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుమ్ముల పేట భూములపై జ్యూడిషియల్ విచారణ చేయాలని రమణరాజు కోరారు.