డిజివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ కమిటీలు వేయాలి..
Ens Balu
1
Visakhapatnam
2020-09-21 18:52:39
విశాఖ జిల్లాలో డివిజన్ స్థాయి రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో సమావేశపరిచి, కమిటీలు ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. ఎస్.సి., ఎస్.టి., అట్రాసిటీలపై జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంను సోమవారం జిల్లాకలెక్టరేట్ లో నిర్వహించారు. ఎస్.సి., ఎస్.టి.లపై అట్రాసిటీలపై ఉన్న కేసులు సత్వరమే పూర్తి కావాలన్నారు. పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి.లకు సంబంధించి రావలసిన నష్టపరిహారం రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఏజన్సీలో అతి తక్కువ కేసులు నమోదౌతున్నప్పటికి వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ఉపాధ్యాయుని పై పై స్థాయి ఉద్యోగి కులం పేరుతో దూసించారని, దీనికి సత్వరమే న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి.లకు సంబంధించి ఉంటున్న కేసులు న్యాయబద్దంగా ఉన్నవైతేనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఈ సమావేశం తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ లో సమావేశం ఉంటుందని, ఈ మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. కమిటీ సభ్యులు జోసెఫ్ మాట్లాడుతూ గోపాలపట్నంకు సంబంధించి ఒక ప్రిన్సిపల్, ఉద్యోగులకు మధ్య జరిగిన సంఘటన గూర్చి కలెక్టర్ వివరించగా దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత పోలీసు అధికారిని అడుగగా చార్జ్ షీట్ తయారు చేసినట్లు చెప్పారు. తహసిల్థార్ల కార్యాలయాలకు, పోలీసు స్టేషన్లకు వెల్లి ఫిర్యాదులు ఇస్తే తీసుకొనేటట్లు ఆదేశాలు జారీ చేయవలసినదిగా కలెక్టర్ ను సభ్యులు మల్లేశ్వరరావు కోరగా సి.పి., ఎస్.పి., తహసిల్థార్లకు లేఖలు పంపాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎస్.సి., ఎస్.టి.లకు ప్రభుత్వం పంపిణీ చేసిన బంజర భూములకు పట్టాలు పంపిణీ చేయాలని, 20 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారని కలెక్టర్ దృష్టిటి తీసుకురాగా పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈసమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జిల్లా ఎస్.పి. కృష్ణారావు, జిల్లా జాయిట్ కలెక్టర్లు-1,2,3 ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, ఆర్డిఓ పెంచల కిషోర్, సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు రమణమూర్తి, పోలీసు అధికారులు, తదితర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.