సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈనెల 6వ తేదీన నెల్లూరు జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు జిల్లా పోలీసు అధికారి పరమేశ్వర్ రెడ్డి ఇతర పోలీసు అధికారులతో భద్రతా సమీక్షను నిర్వహించారు. అనంతకం కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం జగన్ మోహనరెడ్డి కొవ్వూరు హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2:30 గం. కు బయల్దేరి 2.50 గంటలకు తిరుపతి ఏర్పోర్ట్ చేరుకుంటారన్నారు. మూడు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో తిరుగుపయనం కానున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల పరిశీలన ASL లో భాగంగా జిల్లా కలెక్టర్, లు సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ రూమ్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, ఎస్ ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ కృష్ణారెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి బాలకృష్ణన్, జిల్లా ఫైర్ అధికారి రమనయ్య, ఆర్డీవో శ్రీకాళహస్తి రామారావు, డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్, సురేంద్ర, రేణిగుంట తహసిల్దారు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.