గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ ఆదేశించారు. ఆదివారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరములో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పై మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో కలెక్టర్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు యొక్క అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఆమె తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇచ్చి పనులు ప్రతిపాదించాలని ఆమె సూచించారు. ప్రతి సచివాలయానికి ప్రజలు సూచించిన పనులు చేపట్టేందుకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని ఆమె తెలిపారు.
ఈ నిధులను వినియోగించుకొని మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రైన్లు , విద్యుత్ సదుపాయాలు వంటి పనులు చేపట్టేందుకు సంబంధిత నియోజకవర్గం ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ప్రతిపాదనలు, అంచనాల రూపొందించి పంపించాలని కలెక్టర్ సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు, పనులు ప్రతిపాదనలు అన్నింటిని సకాలం లీక్ పూర్తిచేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనులు ఏ విధంగా అప్లోడ్ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో సి పి కె. శ్రీనివాసరావు , డిఎల్డి ఓ ,సి హెచ్ అప్పారావు , మున్సిపల్ కమిషనర్లు , మండల అభివృద్ధి అధికారులు. , డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు .