గురు శిష్య సంప్రదాయం మానవ జాతికి శ్రీరామ రక్ష అని సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎస్ఎన్ రాజు అన్నారు. విశాఖలోని డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సహకారంతో విశాఖ వెబ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచార్య జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన తమకు ఆ ఆత్మసంతృప్తి ఎప్పుడూ ఉంటుందని, ఉపాధ్యాయుడిగా, అధ్యాపకులుగా సమాజము లో అందుకున్న గౌరవంతో పాటు ఎల్లప్పుడూ తమ బాధ్యతలను కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతా మన్నారు. ఏయూ జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డివిఆర్ మూర్తి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్రతీ రోజు తరగతి గదిలో సరికొత్త అంశాలను మేళవించి విద్యార్ధులు కి అర్థమైన రీతిలో పాఠ్యాంశాలు బోధించాల్సిన అవసరం ఉందన్నారు..
విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతతో పాటు సమాజానికి కూడా ఉపాధ్యాయుల సేవలు ఎంతగానో అవసరమని వీరంతా అభిప్రాయపడ్డారు. తమ విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తే ఆ సంతృప్తి జీవితాంతం అంతులేని ఆనందం కలిగిస్తుందన్నారు. రాష్ట్రపతి నారీ శక్తి అవార్డు గ్రహీత, ఆచార్య ఎస్.ప్రసన్న శ్రీ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి గురువులకు తమ పిల్లలతో సమానమే అన్నారు.. గురుపూజోత్సవం సందర్భంగా తమ సేవలను గుర్తించి జర్నలిస్ట్ లు సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ప్రముఖ కతక్ డాన్స్ టీచర్, అధ్యాపకురాలు ఇప్సాత్ రాయ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల తోనే నవసమాజ ప్రగతి సాధ్యమని, వారి వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవార్డు గ్రహీత ఎస్టి పి లక్ష్మి కుమార్ మాట్లాడుతూ, గురువు ఎక్కడైతే గుర్తించబడతారో అక్కడ చదువులమ్మ కొలువుదీరి వుంటుందన్నారు.
విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, గురుపూజోత్సవం సందర్భంగా గురువులను సత్కరించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలుపంచుకునే విధంగా అవకాశం కల్పించిన విశాఖ వెబ్ జర్నలిస్టు అసోసియేషన్ నిర్వాహకులను అభినందించారు. విజేఎఫ్ సెక్రటరీ దాడి రవి కుమార్, ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ, గురువులు గొప్పతనము తెలియ జేశారు. అంతకు ముందు ఆచార్య జీఎస్ఎన్ రాజు, ఏయూ జర్నలిజం విభాగం అధ్యాపకులు ఆచార్య డివిఆర్ మూర్తి, రాష్ట్రపతి నారీ శక్తి అవార్డు గ్రహీత, ఆచార్య ఎస్.ప్రసన్న శ్రీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవార్డు గ్రహీత ఎస్టి పి లక్ష్మి కుమార్. ప్రముఖ కతక్ డాన్స్ టీచర్, అధ్యాపకురాలు ఇప్సాత్ రాయ్ లను దుస్సాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు ఎం ఎస్ ఆర్ ప్రసాద్, ఇరోతి ఈశ్వర రావు, సీనియర్ పాత్రికేయుడు బండారు శివప్రసాద్, వెబ్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ, టీవిఎన్ ప్రసాద్, గురు ప్రసాద్, మదన్, రవి, గోపీనాథ్, బుద్ధ భాస్కర్, ఉదయ్, జనా, రాము తదితరులు పాల్గొన్నారు. స్కూలు ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్య క్రమాలుతో సభికులను అలరించాయి.