రూ.186 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రులు..


Ens Balu
3
Parvathipuram
2020-09-21 19:03:00

విజయనగరం జిల్లాలో రూ.186 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో భవనాలు  మౌలిక వసతులు కల్పించనున్నామని డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ చెప్పారు. సోమవారం పార్వతీపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి సీదిరి అప్పల రాజు పార్వతీపురంలో పర్యటించి ఆసు పత్రులు నిర్మించనున్న స్థలాలను పరిశీలించారు. అదేవిధంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి మంజూరు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపికచేయడం జరిగిందన్నారు.  ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రూ.49 కోట్లతో ఇక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని, నెల రోజుల్లో ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం పై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలోని కోవిడ్ విభాగాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులు కోరిన వెంటనే బెడ్ కేటాయిస్తున్నారా లేదా అనే విషయాన్ని సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఆసుపత్రిలో కల్పిస్తున్న భోజన వసతి, అందిస్తున్న చికిత్స తదితర అంశాలపై హెల్ప్ డెస్క్ వద్ద ప్రశ్నించారు. కోవిడ్ విభాగంలో బెడ్ ల అందుబాటులో వున్నదీ లేనిదీ తెలిపే విధంగా బయట ఏర్పాటు చేసిన బోర్డును పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక శాసన సభ్యులు అలజంగి జోగారావు, జాయింట్ కలెక్టర్  డా.జి.సి.కిషోర్ కుమార్, ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు ఆఫీసర్ ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ విదే ఖర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జి.నాగభూషణ రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.