రైలు ప్రయాణికుల అవసరాలను గుర్తించాలి


Ens Balu
5
Kakinada
2022-09-05 06:48:31

రైలు ప్రయాణికుల అవసరాలు డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని వాటికి రైల్వే శాఖ ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని గాంధీభవన్ లో జిల్లా, కాకినాడ టౌన్ ప్రయాణికుల సంఘ సమావేశం అధ్యక్షుడు వై డి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గీత మాట్లాడుతూ దేశం మొత్తంగా రైల్వే శాఖకు  అధిక ఆదాయం మన దక్షిణ మధ్య రైల్వే నుండి లభిస్తుందన్నారు. కోస్టల్ కారిడార్ విస్తరణ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానన్నారు. కొన్ని  ఎక్స్ప్రెస్ రైళ్లు సామర్లకోటలో నిలుపుదల చేయడానికి కృషి చేయగా అధికారులు స్పందించి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు, సిటీ బస్సులు ఏర్పాటుకు గాను ఆర్టీసీ అధికారులతో సంప్రదిస్తానని గీత తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి అడ్డూరి రవిరాజా, ఉపాధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, ఏ .వెంకటేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.