సచివాలయ పరీక్షకు 2వ రోజు 68.15 శాతం హాజరు..
Ens Balu
1
Vizianagaram
2020-09-21 19:07:42
జయనగరంజిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి సోమవారం నిర్వహించిన రెండోరోజు పరీక్షలు కూడా ప్రశాంతంగా జరిగాయి. విజయనగ రంలోని 19 పరీక్షా కేంద్రాల్లో ఉదయం పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 5,756 మంది హాజరు కావాల్సి ఉండగా, 3,714 మంది హాజరయ్యారు. 2042 మంది పరీక్షకు గైర్హాజరు కావడంతో, హాజరు శాతం 64.52గా నమోదయ్యింది. మధ్యాహ్నం 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2,995 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,041 మంది హాజరయ్యారు. 954 మంది గైర్హాజరు అవ్వడంతో, హాజరు శాతం 68.15గా నమోదయ్యింది. విజయనగరం ఎంఆర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తనిఖీ చేశారు. సెయింట్ జెసెఫ్ పాఠశాల, ఎజిఎల్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు తనిఖీ చేశారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైద్యసిబ్బందితోపాటు మందులు, మంచినీరు, వికలాంగులకు వీల్ సైకిళ్లను ఏర్పాటు చేశారు.