దివ్యాంగులకు పునరావాస కేంద్రాలు నిర్మాణం


Ens Balu
10
Parvathipuram
2022-09-06 10:11:10

పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యాగుల పునరావాస కేంద్రం నిర్మించి నిర్వహణ చేపట్టేం దుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం. కిరణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో  విభిన్న ప్రతిభావంతులకు సేవలు అందుబాటులోకి తెచ్చుటకు ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లాలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయుటకు జిల్లా పర్యవేక్షణ కమిటీని స్థాపించామని అన్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి,నోడల్ ఏజెన్సీని ఎంపిక చేయుటకు ఆసక్తి గల స్వచ్చంద సంస్థలు, రెడ్ క్రాస్ వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. దరఖాస్తులు  ఈనెల 8వ తేదీలోగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు,హిజ్రాలు, వయోవృద్ధుల శాఖ, పార్వతీపురం కార్యాలయంలో  సమర్పించాలని అన్నారు. పూర్తి వివరాలకు www.socialjustice.gov.in వైబ్సైట్, 9441416375 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో వివరించారు.