ఐసిడిఎస్ పథకాలపై అవగాహనకల్పించాలి


Ens Balu
14
Bhimavaram
2022-09-06 10:52:07

సంపూర్ణ పోషకాహార పథకం పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి ఐ సి డి ఏస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరు కార్యాలయంలోని తన ఛాంబర్ లో  ఐ సి డి ఎస్ పిడి  ,సిడిపిఓ లతో  సంపూర్ణ పోషకాహార పథకం అమలు ,ఇతర పథకాలపై జిల్లా  కలెక్టరు  సమీక్షించారు. ఈ సందర్భంగా  కలెక్టరు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో , మండలాలలో  గర్భిణీలు బాలింతలు కు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి సంపూర్ణ పోషకాహార పథకం ప్రజలలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.  సంపూర్ణ పోషకాహార మాసోత్సవాలు ఈనెల 30 వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఈ మాసోవోత్సవాల్లో పోషకాహార  సంపూర్ణ పోషకాహారం  యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసే విధంగా వర్క్ షాప్ లు నిర్వహించాలని ఆమె అన్నారు. 

ఈ కార్యక్రమంలో సి డి పి వోలు ముఖ్యపాత్ర పోషించాలని కలెక్టరు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పండుగ వాతావరణం సృష్టించడం ,  ఆశా వర్కర్లు వైయస్సార్ సంపూర్ణ పోషణ ,  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ యొక్క న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేసి, ఇచ్చిన వస్తువులను ఉపయోగించి సంపూర్ణ పోషకాహారం ఏవిధంగా పొందవచ్చునో వారికి వివరించాలని కలెక్టరు సూచించారు.  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో అందిస్తున్న రాగి  ,సజ్జ , జొన్న , అటుకులు, ఎండు ఖర్జూరం , బెల్లం వేరుశనగ చిక్కీలు వంటి బలవర్ధకమైన ఆహారం తో పాటు పాలు  ,గుడ్లు వినియోగాన్ని వారికి  వివరించాలని  కలెక్టరు సూచించారు.  

వీటిపై ప్రదర్శనలను నిర్వహించాలని ప్రజాప్రతినిధులు  , కమ్యూనిటీ ప్రభావశీలుర్లను ఆహ్వానించడం ద్వారా సంపూర్ణ పోషకాహార పథకం  యొక్క ప్రాముఖ్యతపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. పోషకాహార మహోత్సవాలలో గర్భిణీలు , బాలింతలు, చిన్నారులు ఏ ఆహారం తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి వివరించాలని కలెక్టరు సూచించారు. జిల్లాలో ఎక్కడ పోషకాహారం లోపంతో పిల్లలు , గర్భిణీలు , బాలింతలు ఎవరు ఉండకూడదని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐ సి డి ఎస్ పి డి   బి. సుజాత రాణీ,  సిడిపిఓలు వి. వాణి విజయ రత్నం,సి హెచ్ ఇందిర,బి. ఊర్మిళ, టి యల్ సరస్వతి,పి ఆర్ రత్న కుమారి, మేరీ ఏలిజబెత్,శ్రీ లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు .