ధరఖాస్తుదారులను వేధిస్తే సహించేది లేదు


Ens Balu
10
Paderu
2022-09-06 12:58:16

మ్యుటేషన్ దరఖాస్తుదారులను వేదిస్తూ పదే పదే తిప్పటం సరికాదని, అంతే కాకుండా విఆర్ఓ లాగిన్ లో రిజెక్ట్ చేయటo జరుగుతోందని, అటువంటి సందర్భాలలో ఆయా తహసిలదార్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలక్టరేట్ విసి హాల్ నుండి మండల స్థాయి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ,  మ్యుటేషన్ దరఖాస్తుదారులకు కుటుంబ సభ్యుల ధృవీకరణ, నోటరీ అఫిడివిట్ లేకుండా సిసిఎల్ఎ సూచనల ప్రకారం మ్యుటేషన్ చేయాలని ఆదేశాలు జారీ  చేసినప్పటికీ కొంతమంది తహసిల్దార్లు పట్టించుకోటం లేనందున చాలా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిషేక్ ను వారితో సమీక్షించి మ్యుటేషన్లు త్వరగా పూర్తీ చేయాలని ఆదేశించారు. 

11 మండలాలు తిరిగి  విఆర్ఓల పని తీరుపై అసంతృప్తి వ్యక్త పరిచిన సబ్ కలెక్టర్ 15 మంది విఆర్ఓలకు నోటీసులు జారీ చేసామని సబ్ కలెక్టర్ తెలిపారు.  సచివాలయాలలో పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ ఉండటంపై కూడా కలెక్టర్ అసంతృప్తి వ్యక్త పరుస్తూ సకాలంలో పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22 పెన్సన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న కొయ్యూరు తహసిల్దార్ గూర్చి ఆరా తీయగా తనకి డిజిటల్ సైన్ కాలేదని తెలిసుకుని, జాయినై నెల దాటినా డిజిటల్ సైన్ లేకుండా ఎం చేస్తున్నారని, మరుసటి వారం విసి నాటికి డిజిటల్ సైన్ తీసుకోకపోతే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.  అదేవిదంగా  సచివాలయ సిబ్బందిని తరచూ సమీక్షించాలని, సచివాలయ సిబ్బంది యునిఫారం ధరించేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ లను ఆదేశించారు.  

 ప్రతి సచివాలయంకు గడప గడపకు మాన ప్రభుత్వం కింద రూ.20 లక్షలు మంజూరు అయినందున సంబంధిత శాశన సభ్యులుతో చర్చించి ఆయా సచివాలయాల పరిధిలో చేపట్టాల్సిన పనులను అప్లోడ్ చేయాలని, సాంకేతిక, పరిపాలనాపరమైన మంజూరులు పొందాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా నుండి డిఆర్ఓ బి. దయానిధి, మండలాల నుండి, ఇటిడిఎ ప్రోజేక్ట్ అధికారులు రోణంకి గోపాల కృష్ణ, సూరజ్ గనోరే, తహసిల్దార్లు, ఏమ్పిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు