అవధాన కవి బ్రహ్మోత్సవం సందర్భము గా ప్రముఖ ఆసుకవి పద్య పితామహులు శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 20 వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి కళాభారతి లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను బుధవారం కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు మా శర్మ సింహాద్రి నాథుడు, శ్రీదేవి భూదేవి ,పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా శర్మ మాట్లాడుతూ మూడేళ్లకు సంబంధించిన ప్రతిభా పురస్కారాలను ఈ యేడాది అందజేస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రముఖ సంగీతదర్శకులు డాక్టర్ సింగీతం శ్రీనివాసరావు కు జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు గరికిపాటి నరసింహారావు అధ్యక్షత వహించగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నుంచి అవధానులు, ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు.
మాశర్మతో పాటు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తదితరులంతా ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయము వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ కొప్పరపు కవులు కనకదుర్గ, ఆంజనేయస్వామి ఉపాసకులని, ఏదైనా మనసులో సంకల్పిస్తే అది తప్పకుండా నెరవేరుతుందన్నారు అటువంటి కార్యక్రమంలో ప్రతీ ఏటా తాను పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాపీఠం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.