రూ.206 కోట్లతో ఆసుప్రతులు ఆధునీకరణ..మంత్రిఆళ్ల
Ens Balu
3
Seethampeta
2020-09-21 19:53:57
శ్రీకాకుళం జిల్లాలో రూ.206 కోట్లతో నాడు – నేడు మరియు నాబార్డు క్రింద అన్ని ఆసుపత్రుల ఆధునీకరణ పనులను చేపట్టాని డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివా స్ ( నాని ) స్పష్టం చేసారు. ప్రత్యేకంగా సీతంపేటలోని ఆసుపత్రికి రూ. 19 కోట్ల నాబార్డు నిధులను మంజూరుచేయడం జరిగిందని, మంజూరైన నిధులతో టెండర్లు పిలిచే ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా పెనువిపత్తును ఎదుర్కొన్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొని అందరికీ ఆదర్శంగా నిలిచామని, కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేసారు. భవిష్యత్తులో ఎలాంటి వైరస్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఆసుపత్రుల నిర్మాణమే కాకుండా ఇటీవల 7వేలకు పైగా వైద్యులు, స్పెషలిస్టులు, నర్సుల నియామకం చేపట్టామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత పెద్దఎత్తున రిక్రూట్ మెంట్ జరిగిన దాఖలాలు లేవని తేల్చిచెప్పారు. అదేవిధంగా కొన్ని వేల మంది వైద్యులు, స్పెషలిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని కోవిడ్ నివారణ కోసం తీసుకోవడం జరిగిందని అన్నారు. నవరత్నాలు, నాబార్డు , నాడు – నేడు నిధుల క్రింద రూ16 వేల కోట్లు వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా పి.హెచ్.సి నుండి పెద్ద ఆసుపత్రి వరకు, శిక్షణ సంస్థలు, ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి ఎక్వీప్ మెంట్ తదితర ఆధునీకరణ పనులు చేయబోతున్నామని తెలిపారు. జిల్లాలోని 386 సబ్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పేదలకు నాణ్యమైన వైద్యం అందడం హక్కుగా కల్పిస్తామని చెప్పారు. రిమ్స్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుందని, ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో రెట్టింపు శ్రద్ధతో ఆరోగ్యవ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీతంపేట ఎం.పి.డి.ఓ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రులకు మరియు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పోలీసులు నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ పర్యటన కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ , రాజాం శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, మామిడి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, ఆర్.డి.ఓ టి.వి.ఎస్.జి.కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ డా. ఏ.కృష్ణవేణి, డి.ఎం.హెచ్.ఓ డా.ఎం.అనూరాధ, డి.సి.హెచ్.ఎస్ జిల్లా సమన్వయకర్త డా.బొడ్డేపల్లి సూర్యారావు, నగర పంచాయతీ కమీషనర్ బి.ఎం.శివప్రసాద్, పాలకొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జె.రవీంద్ర కుమార్, సీతంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డా.ఎన్.శేషగిరిరావు, పాలకొండ మండల తహసీల్దార్ ఎం.రాజశేఖరం, ఎం.పి.డి.ఓ జె.ఆనందరావు, సీతంపేట మండల తహశీల్ధారు పి.సోమేశ్వర్, ఎం.పి.డి.ఓ వై.ఉమామహేశ్వరరావు, పాలకొండ మండల సర్వేయర్ పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.