అర్హులైన జర్నలిస్టులకి అక్రిడిటేషన్లు అందిస్తాం..


Ens Balu
19
Visakhapatnam
2022-09-20 10:30:23

 విశాఖపట్నంలో జర్నలిస్టులు మంగళవారం కదం తొక్కారు, కోర్కెల దినం ఆందోళనలో గొంతు కలిపారు. జర్నలిస్టుల సమస్యల  పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్,  ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అక్రిడేషన్ల సమస్యను ప్రధానంగా జర్నలిస్టులు కలెక్టర్ కు వివరించారు. వెంటనే ఆయన డీపీఆర్ఓ మణిరాంను  రప్పించి ఈనెల 27వ తేదీలోగా ఆ సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.1994,2005  జర్నలిస్టుల స్థలాల సమస్యకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి పూర్తి వివరాలు అందజేశామని తెలిపారు. జర్నలిస్టులకు ఇల్లు,ఇళ్ల స్థలాలు,బీమా,పింఛన్ సదుపాయం,ఆటాక్స్ కమిటీల నియామకాలు చేపట్టాలని  కలెక్టర్ ను కోరారు..ఈ కార్యక్రమంలో జాతీయ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నగర అధ్యక్షులు పి. నారాయణ్,బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ నగర అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,ఫెడరేషన్  నాయకులు ఎ.సాంబశివరావు,శివప్రసాద్,దాడి రవికుమార్,కామాకుల మురళీకృష్ణ,జి శ్రీనివాసరావు,మధు,బొప్పన రమేష్, రాజశేఖర్,ఎమ్మెస్సార్ ప్రసాద్,చింతా ప్రభాకర్,ఆనంద్ కృష్ణమూర్తి, నగేష్, శివరాం, కడలి ప్రసాద్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.