అభ్యుదయ కవి గురజాడ నేటి తరానికి ఆదర్శనీయం...
Ens Balu
4
Parvathipuram
2020-09-21 20:08:29
సంఘసంస్కర్త, అభ్యుదయ కవి, సామాజిక దురాచారాలను రూపుమాపిన గొప్ప వైతాళికుడు గురజాడ అప్పారావు అని డిప్యూటీ సీఎం మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నా రు. సోమవారం పార్వతీపురంలో గురజాడ 158 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణ దాస్ , పాముల పుష్ప శ్రీ వాణి, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ అప్పలరాజు నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గురజాడ సాహితీ ప్రక్రియలు నేటి తరానికి కూడ ఆచరనీయమని, తన రచనల ద్వారా ఎంతో మంది మహిళలను ప్రభావితం చేసి చైతన్యవంతం చేసిన మహావ్యక్తి గురజాడ మంత్రి ఆళ్ల నాని అన్నారు. బాల్య తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయంఅని గురజాడ వ్రాసిన కన్యాశుల్కం సినిమా చూసిన తర్వాత గురజాడ బావుకత ప్రగాఢ మైన ముద్ర వేసిందని మంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణ దాస్, పాముల పుష్ప శ్రీ వాణి, డాక్టర్ అప్పలరాజు అన్నారు.ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం వాడుకభాషలో అర్థమయ్యే విధంగా రూపొందించిన మహాకవి గురజాడమంత్రులు అన్నారు. అభ్యుదయ కవితా పితామహుడు, కవి శేఖర అనే బిరుదు ఇచ్చి సత్కరించారు అని తెలిపారు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయం ఎక్కడ కనపడినా గురజాడ గుర్తుకు వస్తారని తెలిపారుగొప్ప సంఘసంస్కర్తగా అనేక దురాచారాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారని మంత్రులు కొనియాడారు.