ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం , భక్త కోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి(సింహాద్రి అప్పన్న) ఆలయంలో బుదవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖకు చెందిన భువన విజయం సంస్థ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. వరాహ, నారసింహ అవతారాలతో భక్తులకు దర్శనమిస్తున్న ఆ సింహాద్రి నాధుని తమ కీర్తనలతో కీర్తించారు. సుమారు 40 మంది సభ్యుల బృందం అన్నమాచార్య సంకీర్తనలుతో పాటు విష్ణు సహస్ర నామ పారాయణంలు కూడా గావించారు. దీంతో సింహగిరి హరినామ సంకీర్తనలతో మారుమ్రోగింది.. ఏకాదశి పర్వదినాన ఆ స్వామి సన్నిధిలో తమ బృందం సత్సంగం నిర్వహించడం ఎంతో సంతోషం కలిగించిందని సంస్థ అధ్యక్షులు నెహ్రూ ,కార్యదర్శి జవ్వాది లక్ష్మి పేర్కొన్నారు. ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన సింహాచలం ఆలయ వర్గాలకు బృందం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఆలయ ఏఈవో ఎన్ వి వి ఎస్ ఎస్ ఎ ఎఏన్ రాజు వీరందరికీ స్వామి దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు ఇరగవరపు వెంకట రమణమూర్తి ఆచార్యులు ఆశీర్వాదం అందజేయగా, కార్య క్రమం సమన్వయకర్తగా అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు వ్యవహరించారు..
ఏకాదశి పర్వదినాన సింహగిరిపై విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించడం, అన్నమాచార్య సంకీర్తనలు తో, ఆ స్వామిని సేవించుకోవడం,స్మరించుకోవడం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావిం చాలన్నారు. సింహగిరిపై ఉత్సవాలు సమయంలోనే కాకుండ నిరం తరం సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యా త్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే దిశగా ఆలయ వర్గాలు చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీనుబాబు కొనియాడారు. అనంతరం సంస్ధ సభ్యులు శ్రీనుబాబు ను ఘనంగా సత్కరించారు.