తీరు మార్చుకోకపోతే ఇంటికి పంపిస్తా..జెసి
Ens Balu
1
ఊటగెడ్డ సచివాలయం
2020-09-21 20:11:25
విశాఖజిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది విధినిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించినా, ప్రజలతో సఖ్యతో మెలకపోయినా, పనితీరును మెరుగుపరుచు కోకపో యినా కఠిన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టరుఎం. వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం సోమవారం విశాఖ నగరంలోని ఊటగెడ్డ వార్డు సచివాల యాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ఆయన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్నిఅభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి చిత్తశుద్దితో పనిచేయాలని సిబ్బందిని కోరారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రికార్డులను సవ్యంగా నిర్వహించాలని కోరారు. పంపిణీ చేయ కుండా మిగిలిఉన్న 15 రేషను కార్డులను వాలంటీర్ల ద్వారా పంపిణీచేయాలని ఆదేశించారు. రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయకుండా సరిగ్గా సమాదానాలు యివ్వలేకపోయిన అడ్మినిస్ట్రేటర్ ను తీవ్రంగా మందలించారు. పనితీరును మెరుగుపరచుకోకపోతే తదుపరి పరిపాలనా చర్యలను తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. అనుమతి లేకుండా గైరుహాజరైన వి.ఆర్.ఒ. వి.సూర్యప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతీశాఖ సిబ్బంది హాజరు పట్టికను సక్రమంగా నిర్వహించాలన్నారు. అదే భవనంలో ఉన్న యితర సచివాలయాల సిబ్బందిని కూడా బాద్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహరాణిపేట మండల తహశీల్దారు అప్పలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.