ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి


Ens Balu
15
Parvathipuram
2022-09-28 13:52:42

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.జగన్నాథరావు తెలిపారు.  బుధవారం  ఆయన పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి ని సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్. వాగ్దేవితో కలిసి ఆసుపత్రిలో పలు విభాగాలను పర్యవేక్షించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.  నవజాత శిశువు ల ప్రత్యేక చికిత్సా విభాగంలో అందిస్తున్న చికిత్సను ఆ విభాగపు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి న్యూట్రిషన్ రీహేబిలిటేషన్ కేంద్రాన్ని పర్యవేక్షణ చేసి అక్కడ పిల్లలకు ఇస్తున్న పౌష్ఠికాహారాన్ని, వారి తల్లులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తలసేమియా వైద్య సేవలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ రికార్డులను పరిశీలించి తలసేమియా మరియు సికిల్ సెల్ రక్తహీనత రోగులకు ఇస్తున్న మందులు , చికిత్సా విధానాన్ని పరిశీలించారు. 

పి.పి. యూనిట్ విభాగాన్ని సందర్శించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న  వారిని పర్యవేక్షణ చేసి వారికి ఇస్తున్న సేవలగూర్చి వైద్యులు డాక్టర్ విజయ్ మోహన్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతాల వారీగా కూడా ఈ  కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స లు అమలు జరపాలని అందుకు గల కార్యాచరణ ప్రణాళికలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి ఇమ్యు నైజేషన్ అధికారి డాక్టర్ టి. జగన్మోహన్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.