అధిక దిగుబడులకే ఈ పరిశోధనా కేంద్రాలు


Ens Balu
18
Srikakulam
2022-09-29 11:47:31

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన  అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అధిక దిగుబడులు అందజేయడానికే ఈ పరిశోధనా కేంద్రమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రోసెసింగ్  శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అతిథులు వై.ఎస్.ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం కృషి ఎంతో ఉందని అన్నారు.  రైతాంగానికి అండగా నిలిచిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అభివర్ణించారు. 

కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో 20 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని, వాటిలో ఒకటి శ్రీకాకుళం బూర్జ మండలం పెద్దపేట లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే పరిశోధనా కేంద్రం మంజూరు చేసిన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయం అంటే వరి మాత్రమే కాదని, ఉద్యాన, పట్టుపరిశ్రమ, పోలి కల్చర్ మరెన్నో పంటలు కూడా వ్యవసాయమేనని సభాపతి గుర్తుచేశారు. ఉద్యాన పంటలు పండించి మంచి లాభాలు పొందాలని రైతులని కోరారు. పేదరికం విద్యకు, వైద్యానికి అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు అండగా ఉన్నారన్నారు. ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదరికాన్ని పారద్రోలేలా మన ముఖ్యమంత్రి అనేక పథకాలు అందజేస్తున్నారు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు నష్టపోతున్నా వారికి అండగా ఈ ప్రభుత్వ నిలుస్తోందని వివరించారు.

కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస రావు మాట్లాడుతూ వ్యవసాయం ఒక దండగ వ్యవహారం అన్న రాష్ట్ర పరిస్థితిని వ్యవసాయం ఒక పండగ అన్న స్థానానికి తీసుకు వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు విత్తనం నుండి విక్రయం వరకు నేనున్నాను అని రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం, ఎరువు అందజేస్తున్నారు అన్నారు. జగనన్న పాలనలో రైతులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. వ్యవసాయమే కాదు ఉద్యాన పంటలపై దృష్టి సారించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు.

ఎమ్మెల్సీ పాలవలస రాజ శేఖర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు తండ్రి అడుగుజాడల్లో ముఖ్య మంత్రి ముందుకు సాగుతున్నారన్నరు. ఈ పరిశోధనా కేంద్రం ద్వారా మరిన్ని మెళుకువలు తెలుసుకొని మరింత లాభం కలిగేలా పంటలు వేసుకోవాలని అన్నారు. రైతు దళారుల చేతిలో మోసపోకుండా చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.

మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక్కటే నాలెడ్జ్ షేరింగ్ ఉండాలనే ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తే రైతుకు లాభదాయకం ఉంటుందో అన్న పలు సమాచారం రైతుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయడానికి పరిశోధనా కేంద్రం ఎంతో అవసరమని గుర్తించి శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతుకు సంపూర్ణ మద్దతు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వెస్తుందన్నారు. రైతు ఏటువంటి అపద వచ్చినా నేనున్నానని అన్ని విధాలుగా సహాయ సహకారాలు వై.ఎస్.ఆర్.ప్రభుత్వం అందజేస్తుంది అన్నారు. ముఖ్య మంత్రిగా భాద్యతలు తీసుకున్న నాటి నుండి నేటివరకు తండ్రి బాటలో అడుగులు వేస్తూ రైతుకు అండగా ఈ ప్రభుత్వ నిలిచిందన్నారు. అంతే కాకుండా మహిళకు సమాజం లో ఒక అగ్రస్థానం కల్పించాలని ప్రతి పథకం మహిళలకే అందజేస్తున్నారు అన్నారు.

కార్యక్రమంలో డా.వై.ఎస్.ఆర్.హెచ్.యు వైస్ ఛాన్సలర్ డా.జానకి రామ్ ప్రారంభ ఉపన్యాసం గావించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి రాబోయే తరాలకు ఏంటో అవసరమని గుర్తించి ముందుచూపుతో 2007లో ఉద్యాన విశ్వ విద్యాలయం ప్రారంభించారు. మన గౌరవ ముఖ్య మంత్రి ఉద్యాన పరిశోధన ప్రాధాన్యతను గుర్తించి మరింత ప్రాధాన్యత కల్పిస్తూన్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో  ఈ పరిశోధనా కేంద్రం ప్రారంభం చరిత్రలోనే గుర్తు ఉంటుందన్నారు. పరిశోధనా కార్యక్రమంలో భాగంగా ఎన్నో పరిశోధనలు చేసి అందజేయడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ నూక సన్యాసి రావు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం ఎక్సిబిషన్ స్టాల్స్ సందర్శించారు,  పరిశోధనలకు సంబంధించిన గోడ ప్రతి, కరపత్రం అతిథులు విడుదల చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి, శాసన మండలి సభ్యులు పాలవలస రాజశేఖర్, దువ్వాడ శ్రీనివాస్, కళింగ కోమటి కార్పొరేషన్ ఛైర్మెన్ అందవరపు సూరిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి, డి.సి.సి.బి. చైర్మెన్ కరిమి రాజేశ్వర రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శిమ్మ నేతాజీ, బూర్జ ఎం.పి.పి కర్నేన దీప, జెడ్.పి.టి.సి బి.రామారావు, పెద్దపేట సర్పంచ్ అనెపు వరలక్ష్మి, ఎం.పి.టి.సి ఖండాపు నవీన, ఆముదాలవలస నియోజక వర్గంలో రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.