నవరత్నాలు పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేందుకు జిల్లా కలెక్టర్లు క్రుషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి సూచించారు. గురువారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం లో ఇచ్చిన పనుల మంజూరు ఉత్తర్వులు, ఈ-క్రాప్ నమోదు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్స్ , డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జగనన్న ఇండ్లు, టిడ్కో గృహాలు, జగనన్న భూ హక్కు - భూ రక్షా సర్వే, స్పందన, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పరిధి లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇంటింటి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం తో పాటు ఆయా గ్రామాలకు సంబందించిన అవసరమయిన పనులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మానాలు, ఈ-క్రాఫ్ వంటి విషయాలలో కలెక్టర్లు, జిల్లా మండల వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అనకాపల్లి నుండి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి జిల్లా ఎస్పీ గౌతమి శాలి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు.