ప్రాధాన్యత పనులు సత్వరమే ప్రారంభించండి


Ens Balu
7
Bhimavaram
2022-09-29 13:18:50

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనులకు  అక్టోబర్ 5 లోగా మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, అక్టోబర్ చివరికి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం లో స్థిరమైన వృద్ధి సాధించాలన్నారు. గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గడప గడపకు మన ప్రభుత్వం లో ఇచ్చిన పనుల మంజూరు ఉత్తర్వులు, ఈ క్రాప్ నమోదు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు జీ ఎస్, అర్భికే, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్స్ , డిజిటల్ లైబ్రరీ భవనాల  నిర్మాణం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జగనన్న ఇండ్లు, టిడ్కో గృహాలు, జగనన్న భూ హక్కు - భూ రక్షా సర్వే, స్పందన, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా సీ యం సమీక్షిస్తూ  అత్యంత ప్రతిష్టత్మకంగా  చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామ వార్డ్ సచివాలయాల పరిధి లో ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఇంటింటి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం తో పాటు ఆయా గ్రామాలకు సంబందించిన అవసరమయిన పెండింగ్ మరియు  నూతన పనులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి కృషి  తోడ్పాటును అందించాలని  ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనం నిర్మానాలు, ఈ - క్రాఫ్ వంటి విషయంలో జిల్లాలో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, మండల స్థాయి అధికారులు  క్షేత్ర స్థాయిలో  పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో భీమవరం కలెక్టర్ కార్యాలయం  నుండి  జిల్లా కలెక్టర్  పి.  ప్రశాంతి , ఎస్ పి యు. రవిప్రకాష్ , జాయింట్ కలెక్టర్  జె వి మురళి, డి ఆర్ ఓ కె. కృష్ణ వేణి,  పంచాయతీరాజ్ ఎస్ ఈ . శ్రీనివాసరావు, సీపీవో  కె  .శ్రీనివాస్ , జిల్లా హోసింగ్ అధికారి   రామరాజు ,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  జ.వెంకటేశ్వరరావు ,  డ్వామా పి డి, రాజేశ్వరరావు , డి ఎల్ డి వో లు  కె .సి హెచ్ అప్పారావు  తదితరులు  పాల్గొన్నారు.