ధాన్యం సేకరణలో వాలంటీర్లే కీలకపాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ధాన్యం సేకరణ పై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ లో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ధాన్యం సేకరణ పై గ్రామ వాలంటీర్లే కీలకపాత్ర పోషించాలని తెలిపారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలన్నారు. అందరికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. టెక్నికల్ అసిస్టెంట్లు జాబితా ఇప్పటికే సేకరించినట్లు చెప్పారు. కేటగిరీల వారీగ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని చెప్పారు. మండల స్థాయిలోను సమావేశాలు నిర్వహించాలన్నా రు. టెక్నికల్ అసిస్టెంట్లు అర్హత గల వారే ఉండాలన్నారు.
ధాన్యం సేకరణలో పాల్గొనే వాలంటీర్లకు 1500 రూపాయలు ప్రోత్సాహకం ఉంటుందని వివరించారు. ఈ క్రాప్ లో నమోదు చేసుకున్నవారి వద్ద నుండి మాత్రమే ధాన్యం సేకరణ జరగాలన్నారు. ఈ క్రాప్ పై రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలీసులు చెక్ పాయింట్ల ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా బోర్డర్లు నుండి ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చూడాలని చెప్పారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని వెళ్లాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు అన్ని వసతులను ముందుగానే చూసుకోవాలన్నారు. జిల్లా పైన ప్రత్యేక దృష్టి ఉంటుందని, జాగ్రత్తగా చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతి, డిఎస్ఓ వెంకటరమణ, జిల్లా కోపరేటివ్ జాయింట్ రిజిస్ట్రార్ ఎస్. సుబ్బారావు, రవాణా శాఖ అధికారి గంగాధర్, మార్కెటింగ్ శాఖ ఎడి కాళేశ్వరరావు, ఫుడ్ కార్పొరేషన్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.