మూడోరోజు సచివాలయ పరీక్షలు ప్రశాంతం..


Ens Balu
2
Vizianagaram
2020-09-22 12:42:49

విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ డా.హరిజహర్ లాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో జరుగుతున్న మూడవ రోజు పరీక్షలను స్వయంగా పరీశిలించారు. ఎంతమంది పరీక్షకు హాజరయ్యారు, ఎంత మంది గైర్హాజరయ్యారు తదితర వివరాలను పరీక్షల సూపరింటెండెంట్ ని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున అభ్యర్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిర్వాహకులకు సూచించారు. వైద్యసిబ్బంది ఎప్పుడు అవసరమొచ్చిన వైద్యసేవలతో పాటు మందులు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, సామాజికి దూరం, మాస్కుల ధారణ తదితర అంశాలను క్షణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత సమయానికి వచ్చిన వారినే అనుమతించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.