మంత్రి ముత్తం శెట్టికోసం మ్రుత్యుంజయ హోమం..
Ens Balu
2
Simhachalam
2020-09-22 12:57:27
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుతూ సింహాచలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మంగ ళవారం త్రయంబక నవగ్రహ మృత్యుంజయ హోమం జరిపించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలు వల్లిస్తుండగా,నాయకులందరూ దేవతామూ ర్తులకు పూజలు చేశారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్రి సత్తిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈహోమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని పూజలు చేసారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, కరోనా ప్రారంభం నుంచి ప్రజా సంక్షేమమే ద్యేయంగా మంత్రి ముత్తంశెట్టి సుడిగాలి పర్యటనలు జరిపారన్నారు. కరోనా విపత్తు నుంచి ప్రజలను ఆదుకోవడానికి అనేక ప్రాంతాల్లో నిరంతరం పర్యటన లు చేసి నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మంత్రి ఆరోగ్యం కొంత కుదుటపడిందని త్వరలోనే మరింత ఆరోగ్యంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. వార్డు ఇన్చార్జి ఈటి శ్రీనివాస్ మాట్లాడుతూ, మంత్రి కోలుకొని తిరిగి ప్రజాసేవకు అంకితం కావాలని తామంతా స్వామిని కోరుకుంటున్నామన్నారు. హోమం నిర్వాహకుడు కర్రి సత్తిబాబు మాట్లాడుతూ, మంత్రి ఆరోగ్యం మెరుగుపడటం కోసం మృత్యుంజయ హోమం జరిపించామన్నారు. వార్డు వైసిపి అభ్యర్థి ఎర్ర వరాహ నరసింహము మాట్లాడుతూ, త్వరగా మంత్రి కోలుకోవాలని ఆకాంక్షించారు.అందరికీ హోమ ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బెహరా భాస్కరరావు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నెంబరు ఆశా కుమారి, వార్డ్ అధ్యక్షులు కొలుసు ఈశ్వరరావు, గునిశెట్టి శ్రీనివాస్, దాసరి కనకరాజు, లండ శ్రీను, గేదెల మురళీకృష్ణ, పలువురు నాయకులు మహిళలు పాల్గొన్నారు.