క్రిమినల్ కేసులు రాజీ చేయుట కొరకు అందరూ కృషి చేస్తే.. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకొంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు, లేబర్ అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలు అనుసరించి నవంబర్ 12 వ తేదీ న శ్రీకాకుళం లో అన్ని కోర్టు సముదాయములలో జరిపే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులకు చేరువ చేయాలన్నారు. ఆ విధంగా చేయడం ద్వారా అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఎక్కువ కేసులు పరిష్కారం చేయటం కోసం కృషి చేయాలని ప్రతీ ఒక్కరూ క్రుషి చేయాలని పిలపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారు అందరు అధికారులను జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం చేయటం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో అదనపు జిల్లా న్యాయ మూర్తులు శ్రీ టీ . వెంకటేశ్వర్లు, జి.చక్రపాణి కె.శ్రీదేవి , సీనియర్ సివిల్ జడ్జి లు కే. నాగమణి , ఎం.అనురాధ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఎక్సైజ్ కమిషనర్ గోపాల్ , శ్రీకాకుళం టౌన్ డి.ఎస్.పి మహేంద్రమతే డెప్యూ టీ కమీషనర్ ఆఫ్ లేబర్ ప్రసాదరావు అధికారులు పాల్గొన్నారు.