తిరుపతి స్కిల్ హాబ్స్ నందు యువతకు శిక్షణ ఇవ్వడానికి స్కిల్ కమిటీ తగిన ప్రణాళికల ను రూపొందించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి సమీక్ష నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంకల్ప్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా నందు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో ప్రతి నెల రెండవ, నాల్గవ శుక్రవారం జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. కమిటీ ముఖ్య ఉద్దేశం జిల్లాలోని యువతకు పరిశ్రమలకు కావాల్సినటువంటి నైపుణ్యం పై వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కిల్ హాబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగుపరచడానికి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమన్వయం చేసుకోవాలని తెలియజేశారు. పిడి డి ఆర్ డి ఎ జ్యోతి గారు మాట్లాడుతూ జిల్లాలోని యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ మేళా క్యాలెండర్ ను ప్రణాళికబద్ధంగా జరగాలని అదేవిధంగా స్కిల్ హాబ్స్ ద్వారా యువతకు శిక్షణ పొందడానికి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి శ్యాం మోహన్, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ, సెట్విన్ సీఈవో మురళీకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి , జె డి ఎమ్ హైమావతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ డీన్ నాగరాజు, ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గౌరీ శంకర్, ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ వి ఎస్ సత్యనారాయణ, కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.