సచివాలయం ద్వారానే ప్రజలకు సేవలందాలి..


Ens Balu
2
రుద్రంపేట-1
2020-09-22 13:48:11

గ్రామసచివాలయాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని జెసి డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం జెసి జిల్లాల్లోని రుద్రంపేట-1 గ్రామసచివాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలకు ఏవిధంగా సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాలు నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినందున అర్హులైన వారిని గుర్తించి వెంటనే కార్డులు జారీ చేయాలన్నారు. గ్రామ వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతీరోజూ బయోమెట్రిక్ వేయడంతోపాటు, సచివాలయాల్లో అందే సేవలను వారికి కేటాయిం చిన 50 కుటుంబాలకు తెలియజేయాలన్నారు. విధి నిర్వహణలో ఎవరు అలక్ష్యం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నిశాఖల సిబ్బంద వారి డ్యూటీ డైరీని ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతీరోజు వారికి కేటాయించిన కుటుంబాలను కలుసుకోవాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సచివాలయంలో కార్యదర్శికి తెలియజేయాలన్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా తదితర పనులను ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా చేప్టాలని సిబ్బందిని ఆదేశించారు.