తూర్పుగోదావరి జిల్లాలో 2022 ఖరీఫ్ సీజన్లో 4.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అంచనా వెయ్యడం జరిగిందని, అందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి పౌర సరఫరా ల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, ఏం డి జీ. వీర్య పాండ్యన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి జేసీ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, 2022-23 ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ కోసం పూర్తి స్థాయి లో సిద్దంగా ఉండాలని నవంబర్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభించ వలసి ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ జిల్లాలో సుమారు 4.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం 80 లక్షల గన్ని బ్యాగులను సిద్దం చేసుకుంటున్నామని, ఇందుకోసం కోటి బ్యాగుల లక్ష్యంగా అడుగులు వేయడం, సి ఎస్ డి టి లకి బాధ్యత ఇచ్చామన్నారు. మిల్లు లను ఇప్పటికే తనిఖీ చేసిన ట్లు శ్రీధర్ తెలిపారు. కూలీలు, రవాణా, ధాన్యం సేకరణ కి సంబంధించి గ్రామ స్థాయి లో శిక్షణ పూర్తి చేశామన్నారు. ఈవారం లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మిల్లుకు - పిపిసి కేంద్రాలను అనుసంధానం చేయడం తో పాటు , ఆరు సమన్వయ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో కూడి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు జేసీ పేర్కొన్నారు. ఈ సమావేశా నికి ఇంఛార్జి మార్కెటింగ్ జిల్లా మేనేజర్ జీ. త్రినాధ్, డి ఎస్ వో పి. ప్రసాద్ రావు లు హాజరయ్యారు.