శ్రీకాకుళం జిల్లాలో 3వ రోజు 72% హాజరు..


Ens Balu
2
Srikakulam
2020-09-22 14:37:35

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం జరిగిన గ్రామ/వార్డు సచివాలయ పోస్ట్ ల పరీక్షలకు 72 శాతం మంది అభ్యర్ధులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ పరీక్షలు 13  కేంద్రాలలో జరిగాయని,  మొత్తం  2610 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా  1879 మంది  అభ్యర్ధులు హాజరయ్యారని చెప్పారు.  731 మంది అభ్యర్ధులు గైర్హాజరయ్యాని చెప్పారు. ఈ రోజు పరీక్షలకు హాజరైన వారిలో ఇద్దరు కోవిడ్ పేషెంట్లు  వున్నట్లుగా చెప్పిన కలెక్టర్ అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. వైద్య సిబ్బంది, మందులు, మంచినీరు, వికలాంగులకు వీల్ చైర్స్ అన్నింటినీ సమకూర్చనట్టు చెప్పారు. హాజరయ్యే వారందరికీ థర్మల్ మీటర్ ద్వారా టెంపరేచర్ చెక్ చేసిన తరువాత మాత్రమే లోనికి అనుమతిస్తున్నామన్నారు. ప్రతీఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నామని వివరించారు..