ప్రజాసంబంధాల బలోపేతానికి 5జి మరింత ఊతం


Ens Balu
10
2022-10-12 13:42:38

ప్రజాసంబంధాలను బలోపేతం చేయడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తు న్నాయని  పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పి.ఆర్.ఎస్.ఐ) విశాఖ శాఖ ఛైర్మన్ డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి పేర్కొన్నారు. విశాఖలోని ఓ హోటల్ లో బుధవారం జరిగిన పి.ఆర్.ఎస్.ఐ. సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా అందుబాటులోకి రానున్న 5జి పరిజ్జానం సోషల్ మీడియా లో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నదని చెప్పారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ స్ట్రా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను 98.5 శాతం మంది మెుబైల్ ద్వారా వినియెాగిస్తున్నారని 5జి టెక్నాలజీ రాకతో 2026 సంవత్సరం నాటికి భారత దేశంలో స్మార్ట్ ఫోన్ ల వాడకం 1 బిలియన్ కు చేరనున్నదని చెప్పారు. ప్రజలకు సత్వర సమాచారాన్ని అధికారికంగా చేరవేయడంలో సామాజిక మాధ్యమాల ఉపయెాగం ప్రజాసంబంధాల అధికారులకు తప్పనిసరి అవుతోందన్నారు. 

పి.ఆర్.ఎస్.ఐ. దక్షిణ భారత ఉపాధ్యక్షుడు యు.ఎస్.శర్మ మాట్లాడుతూ, ట్విట్టర్ వాడకంలో అమెరికా తరువాతి స్థానంలో భారత్ ఉందన్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ వినియోగం ప్రపంచంలో భారత్ లోనే అధికమన్నారు. సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున వినియోగించడం  వలన కూడా సైబర్ నేరాల సంఖ్య దేశంలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా మార్కెటింగ్ నిపుణుడు డి.ఘనశ్యామ్ సామాజిక మాధ్యమాలను ప్రభావ వంతంగా ప్రజా సంబంధాలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫెస్ బుక్ వంటివి వినియోగించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో పి.ఆర్.ఎస్.ఐ. కార్రదర్శి ఎమ్.కె.వి.ఎల్. నరసింహం. కోశాధికారి ఎన్.వి.నరసింహం, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పి.ఆర్. విభాగం అధికారులు పాల్గొన్నారు.