ముంపు బాధితులకు అల్పాహారం అందజేత..


Ens Balu
8
2022-10-13 05:38:42

అనంతపురం నగరంలోని గురువారం వరద ముంపు ప్రాంతాల్లో  మేయర్ మహమ్మద్ వసీం పర్యటించి బాధితులకు అల్పాహారం అందించి సౌకర్యాలపై అరా తీశారు. వరుసగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం మీదుగా వెళ్తున్న నడిమి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వర్షపునీరు వంక సమీపంలోని కాలనీలలోకి వెళుతుండటంతో బాధితులను  కోసం రహమత్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని నగర మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించి సౌకర్యాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు అవసరం ఉన్నట్లు కొందరు మేయర్ దృష్టికి తీసుకురాగా వెంటనే మందులను వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా 43,46,48,49వ డివిజన్ల పరిధిలో డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి తోపాటు స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి అల్పాహారం మేయర్ వసీం పంపిణీ చేశారు.బాధితులు ఎవరూ అధైర్య పడొద్దని అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని భరోసా కల్పించారు.భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముని శేఖర్, అనిల్ కుమార్ రెడ్డి,ఇషాక్ ,రహంతుల్లా ,నాయకులు దాదా ఖలందర్ ,రమణా రెడ్డి ,భారతి,డిఈ చంద్రశేఖర్ ,ఏఈ బాబావలి తదితరులు పాల్గొన్నారు.