ప్రభుత్వ అభివృద్ధి భవన నిర్మాణ పనులలో భాగంగా డిజిటల్ లైబ్రరీల పనులు గ్రౌండింగ్ చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం గ్రామ పంచాయితీ భవనాలు, హెల్త్ క్లీనిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ గ్రామాలు, జలజీవన్ మిషన్ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతంలోని అర్ సి పి ఎల్ డబ్ల్యూ ఇ రోడ్ల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు నివేదికలను పంపించాలని అన్నారు. జిల్లా లోని మండల ఇంజనీరింగ్ అధికారులు, డి ఈ ఈ లను ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. జలజీవన్ మిషన్ క్రింద గ్రామాల్లో ఇంటింటికీ మంచి నీరు అందించే కార్యక్రమం లక్యాలను పూర్తి చేయాలని అన్నారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు, ప్లాస్టిక్ వ్యర్ధాలు వేరుచేసే చెత్త నుండి సంపద కేంద్రాల నిర్వహణను పరిశీలించాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రాధాన్యతా అభివృద్ధి పనుల నిర్మాణాలకు సిమెంట్ కొరత లేకుండా సరఫరా చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ , జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె. రామచంద్రరావు, జిల్లా గ్రామీణ సరఫరా ఇంజనీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, పంచాయతీరాజ్ అధికారి ఎమ్.వి. జి. కృష్ణాజి, జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి జె.శాంతిశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.