ఈశ్రమ్ నమోదు,సేవలు మరిన్నిపెంచాలి


Ens Balu
9
2022-10-13 09:04:34

తిరుపతి జిల్లాలో స్పందన వినతులకు సంబంధించి పరిష్కారం అర్థవంతంగా వుండాలని, ఎనీమియా తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని, ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని మెగా గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ అన్నిజిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా అనంతరం జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ సంబందిత అధికారులతో హాజరయ్యారు. కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై స్పందన వినతుల ను ఆమోదించినప్పుడు అర్జీదారునికి మెసేజ్ అందేలా స్పందన పోర్టల్ లో సదుపాయం ఏర్పాటు చేయబడినదని ఆర్జీలను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించి బియాండ్ ఎస్.ఎల్.ఏ కి వెళ్ళకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. సచివాలయంలో సేవలు మరింత పెంచాలని, ఈ-శ్రమ్ నమోదు పెంచాలని అన్నారు. 

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు వాడకం ను జి. ఓ నంబర్ 65 పర్యావరణ అటవీ శాఖ తేదీ 22.09.2022 ప్రకారం 01.11.2022 నుండి నిషేదించిన సందర్భంలో వాటి నియంత్రణ కు చర్యలు చేపట్టాలని సూచించారు.  ఫ్లెక్సీలు బ్యానర్ ల తయారీలో ప్లాస్టిక్ వాడకం చేయకుండా ప్రత్యామ్నాయంగా కాటన్, బయో డి గ్రెడబుల్ వంటి వాటితో తయారు చేసేలా ఉండాలని సూచించారు. వీటి పర్యవేక్షణ మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, పంచాయితీ అధికారులు తప్పనిసరిగా చేయని అన్నారు. వీటిపై అవగాహన మరియు కల్పించాలని కోరారు.

గడప గడప కు మన ప్రభుత్వంకి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని అత్యంత ప్రాధాన్యత పనులు 454 మంజూరు చేశామని అందులో 169 పనులు పురోగతిలో ఉన్నాయని ఇంకను ప్రారంభం కానీ 285 పనులపై దృష్టి పెట్టి సత్వరమే చేపట్టాలని ఆదేశించారు.  గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది లేట్ అప్పాయింట్ అయిన వారికి శాఖా పరమైన పరీక్షలు పాస్ అయిన వారి పెండింగ్ ప్రోబేషన్ డిక్లరేషన్ ల ప్రతిపాదనలు ఉంటే పూర్తి చేయాలని PRAN నంబర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  జగనన్న తోడు ఐదవ విడత కు సంబంధించి అప్లికేషన్లకు బ్యాంకుల నుంచి లబ్దిదారులకు డబ్బు వారి ఖాతాలకు జమ అయ్యేలా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కృషి చేయాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు తో పాటు యువతను గుర్తింపు లో వాలంటీర్లు సేవలు వినియోగించుకోవాలి అని వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్య పెంపుదల చేపట్టాలని సూచించారు.

మాల్ న్యూట్రిషన్ మరియు స్టంటింగ్ 4 సం. లోపు పిల్లల్లో తగ్గించుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణులకు, బాలింతలకు, కౌమార దశ అమ్మాయిలకు అనీమియాను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో స్టేజి కన్వర్షన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు.  ఇంటి నిర్మాణాలకు SHG లోన్లు అవసరమైన వారికి 35000 సకాలంలో అందించాలని, స్లాబ్ స్థాయి, పై కప్పు స్థాయిలో ఉన్న ఇంటి నిర్మాణాలకు ఎలక్ట్రిసిటీ మరియు డ్రైనేజ్, వాటర్ సప్లై తదితర మౌలిక సదుపాయాలు సత్వరమే కల్పించాలని కోరారు. ఆప్షన్ 3 కింద ఉన్న ఇళ్లకు పెద్ద లేఅవుట్ లకు కాంట్రాక్టర్ లతో త్వరిత గతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. UDA పరిధిలోనీ అర్హత కలిగిన మిగిలిపోయిన పట్టా పొందిన లబ్ది దారులకు కొత్త ఇళ్ల మంజూరు కొరకు లబ్దిదారుల వివరాలను సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేయమని ప్రతిపాదనలు నెలాఖరు లోపు పంపాలని తెలిపారు. PMAY గ్రామీణ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. డిసెంబర్ 21 నాటికి 15446 గృహాల లక్ష్యాలను అధిగమించేలా మెగా గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని తెలిపారు. ఏపీ టిడ్కో ఇళ్లకు రుణాలు మంజూరు బ్యాంకర్లతో మెప్మా సిబ్బంది మాట్లాడి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లోన్లు ఇప్పించాలని ఆదేశించారు. 

రీ సర్వే పై దృష్టి పెట్టాలి అని త్వరిత గతిన పూర్తి చేయాలి అని అన్నారు. జాతీయ రహదారుల భూ సేకరణ, వాటి పరిహార పంపిణీ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ప్రత్యేక అధికారి రామ చంద్ర రెడ్డి, పిడి హౌసింగ్ చంద్ర శేఖర్ బాబు, ఏ డి సర్వే జయరాజ్, జిల్లా ప్లానింగ్ మరియు స్టాటిస్టికల్ అధికారి అశోక్ కుమార్, డి ఎల్ డి ఓ సుశీల దేవి తదితరులు పాల్గొన్నారు.