రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఉదయం పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాలు హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఎన్ ఆర్ ఈ జి ఎస్, తదితర అంశాలపై విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ స్థానిక కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.... క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం స్థల సేకరణ కు సంబంధించి లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ భవన నిర్మాణాలకు కోర్టుకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కార దిశ గా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉంటే తక్షణమే అప్లోడ్ చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 434 రైతు భరోసా కేంద్రాలుగాను 222 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, 482 గ్రామ సచివాలయం భవనాలు గాను 320 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు, 388 విలేజ్ హెల్త్ క్లినిక్ లు గాను 138 విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలపై క ప్రత్యేక దృష్టి పెట్టి పురోగతి సాధించి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు తదితర పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా లక్ష్యాలను నిర్దేశించుకుని చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాలను విడి గా చేయడం ద్వారా సంపద కేంద్రాలలో తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి డి డ్వామా శ్రీనివాస్ ప్రసాద్, ఆర్ బ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.