విజయనగరంలో తగ్గుముఖం పడుతున్న కరోనా..
Ens Balu
3
Vizianagaram
2020-09-22 14:53:59
విజయనగరం జిల్లాలో అధికార యంత్రాంగం తీసుకున్న కట్టుధిట్టమైన చర్యలతోపాటుగా ప్రజల్లో అవగాహన కూడా గణనీయంగా పెరగడంతో కోవిడ్ కేసుల సంఖ్య జిల్లాలో రోజురోజుకూ తగ్గుతూ వస్తుందని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ చెప్పారు. ఇప్పటి వరకూ 2,60,352 టెస్టులు చేయగా, అందులో పాజిటివ్ కేసులు 31,914 గా నమోదు అయ్యాయని అన్నారు. అదేవిధంగా కోలుకున్నవారు 24,654గా వుందని, ఏక్టివ్ కేసులు 7,078గా ఉన్నాయన్నారు. ఇదేవిధంగా రోజుకి ఐదేవలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తుంటే..500 లోపుగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా 182 మంది మాత్రమే మరణించారన్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాల అమలు కూడా జిల్లా పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు. మొన్నటివరకు కరోనా మహమ్మారి ప్రజలను వణికించగా, ఇప్పుడు ఆ భయం కూడా కొంతమేర తగ్గింది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, దైనందిన కార్యక్రమాలు ఎప్పటిలాగే జోరందుకున్నప్పటికీ, కేసుల సంఖ్య మాత్రం తగ్గుతుండటం విశేషమని కలెక్టర్ వివరించారు. మొత్తంమీద కోవిడ్-19 వైరస్ ప్రమాద స్థాయి నుంచి సాధారణ స్థాయికి దిగివస్తుండటం ఊరటనిస్తుందన్నారు. అదే సమయంలో ప్రజలు ఖచ్చితంగా మాస్కుల ధారణ, సామాజిక దూరం, పాటిస్తూ, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని కలెక్టర్ కోరుతున్నారు...