కాకినాడ డీఎంహెచ్ఓ గా డా.శాంతిప్రభను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఆమె నూతనంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ డా.ఆర్.రమేష్ ఇన్చార్జి డిఎంహెచ్ఓగా వ్యవహరించేవారు. ఆయన దగ్గర నుంచి శాంతిప్రభ విధులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మాత్రుమరణాలు తగ్గించి ప్రతీ ఒక్కరికీ ప్రాధమిక వైద్యం అందించేందుకు విశేషంగా క్రుషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు అందించే వైద్య, ఆరోగ్యసేవలను మరింత చేరువ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా నూతన డిఎంహెచ్ఓను కలిసి వారి విధులు, విభాగాలు తదితర వివరాలను ఆమెకు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.