గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిష్కారానికి చర్యలు


Ens Balu
3
2022-10-14 08:34:46

శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.  గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూ గర్భ గనులు శాఖ పై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డిఎస్ఓ నిషా కుమారిలతో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రానైట్ ఇండస్ట్రీస్ పై సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. రెన్యూవల్స్ చేయాల్సిన వాటిని తక్షణమే రెన్యూవల్స్ చేయాలని, సంబంధిత కంపెనీ రెన్యూవల్స్ కు రాకపోతే వారికి కొంత సమయం ఇచ్చి రెన్యూవల్స్ రద్దు చేయాలని భూ గర్భ గణులు శాఖ డిడిని ఆదేశించారు.  గ్రానైట్ పరిశ్రమలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పెద్ద ప్రాజెక్టులకు ప్రజాభియం ఉండాలన్నారు.  

అనధికారికంగా గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. గ్రావెల్ అనుమతులు ఉన్న వారికే గ్రావెల్ క్వారీ తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రావెల్ క్వారీకి అనుమతులు తీసుకోవాలవాలని పేర్కొన్నారు. ప్రతీ నెల సమావేశం ఏర్పాటు చేయాలని ఎడిని ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కు పథకంనకు కొలత రాళ్లు త్వరగా సరఫరా చేయాలని చెప్పారు. నాన్ వర్కింగ్ లీజు లను లీజులుగా కన్వర్సన్ చేసి రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని స్పష్టం చేశారు.  గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిడిని ఆదేశించారు.   ఈ సమావేశంలో ఆర్డీవోలు బి శాంతి, సీతారామమూర్తి, జయరాం, భూగర్భ గనుల శాఖ డిడి ఫణి భూషణ్ రెడ్డి, ఎడి బాలాజి నాయక్, ఎపిపిసిబి ఎఇఇ కరుణశ్రీ, గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు, తదితరులు పాల్గొన్నారు.