పీజీవీవై రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి


Ens Balu
6
2022-10-14 09:54:20

పీఎం గ్రామీణ్ ఆవాస్ యోజన రిజిస్ట్రేషన్ల్ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్  పీఎం గ్రామీణ ఆవాస్ యోజన, హౌసింగ్ స్కీమ్, జిజిఎంపి, డ్రాప్ఔట్ స్టూడెంట్స్ అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కింద 655 గృహ నిర్మాణాలు రిజిస్ట్రేషన్ చేయించాల్సిఉండగా, ఇప్పటివరకు 365 మాత్రమే చేయడం జరిగిందని, ఇంకా చేయవలసిన 290 వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  రిజిస్ట్రేషన్, అప్డేషన్, జియో ట్యాగింగ్   ప్రక్రియను వెంటనే పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ విషయమై అలసత్వం వహిస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఈలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

అలాగే 90 రోజులు ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమంలో సుమారు 1,900 పట్టాలు ఇవ్వడం జరిగిందని అప్ డెషన్ లో ఎందుకు వెనుకబడి ఉంటున్నారని ప్రశ్నించారు.  కోర్టు కేసులు కొట్టివేసిన లేఔట్లలో సుమారు 3,600 వరకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, వారి  రిజిస్ట్రేషన్ లను వెంటనే పూర్తి చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం లో అందిన విన్నపాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. అలాగే వారు కోరిన పనులకు సంబంధించి ఎంపీడీవో పరిధిలో మంజూరు చేసే పనులకు వెంటనే మంజూరు చేసి పనులు చేపట్టాలన్నారు. తమ పరిధిలో లేని వాటికి ప్రతిపాదనాలను వెంటనే తన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. 

 గడపగడపకు కార్యక్రమంలో కోరిన పనులపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు.   పాఠశాలలో డ్రాప్స్  అవుట్స్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, డ్రాప్స్  అవుట్స్ గుర్తించిన పాఠశాలల పరిధిలో ఇంటింటికి వెళ్లి డ్రాప్స్ అవుట్స్  గల కారణాలను తెలుసుకొని , తిరిగి వారిని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరేట్ నుండి హౌసింగ్ పీడీ రామరాజు పాల్గొనగా,  వివిధ మండల కార్యాలయాల నుండి హౌసింగ్ ఇఇలు, డిఇఇలు, ఎ.ఇలు, సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.