అంగన్వాడీల్లోనే గర్భిణీలకు భోజనం పెట్టాలి


Ens Balu
5
2022-10-14 11:48:01

గర్భిణీల  గుర్తింపు,  వారి పర్యవేక్షణ  శతశాతం  జరగాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఐసీడిఎస్, వైద్యఆరోగ్యశాఖ అధికారులను  ఆదేశించారు. బయట జిల్లాల, రాష్ట్రాల  నుండి వచ్చిన వారిని కూడా నమోదు చేసి వారికీ అవసరమగు అలహాలను అందించాలని సూచించారు. ఎలిజిబుల్  కపుల్స్  ను గుర్తించి వారితో ఎప్పటికప్పుడు ఏ.ఎన్.ఎం,ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు  మాట్లాడుతూ ఉండాలని అన్నారు. శుక్రవారం  కలెక్టర్ తన ఛాంబర్ లో ఆకాంక్షల జిల్లా సుచీలైన  వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో  గర్భిణీల నమోదు, సామ్. మాం  , బాల్య వివాహాలు, సఖి బృందాలు,  వ్యవసాయం ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ శాఖలు, పంచాయతి రాజ్, విద్యా శాఖల సూచీల పై  సమీక్షించారు. 3వ సారి గర్భం ధరించిన వారిపై ప్రత్యెక దృష్టి పెట్టాలని, అందుకు గల కారణాల పై ఆరా తీసి వారికీ కౌన్సిలింగ్ చేయాలనీ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల పై , సిజారియన్లు  పై సమీక్ష చేయాలనీ సూచించారు. హై రిస్క్ గర్భినీలను ముందే గుర్తించి వారి పై ప్రత్యెక దృష్టి పెట్టాలని అన్నారు. గర్భిణీల నమోదు పై  లక్ష్యాలు వారీగా సమీక్షించి తక్కువ సాధించిన  వైద్యారులను, సి.డి.పి.ఓ లను అందుకు గల కారణాల పై ఆరా తీసారు. అపార్ట్ మెంట్ ల లో ఉన్న వారు సర్వే కు రానివ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాలంటీర్ల ద్వారా  వెళ్ళాలని, ఒక సారి పరిచయం అయితే ఇక పై సర్వే కు సహకరిస్తారని కలెక్టర్ తెలిపారు. 

అంగన్వాడీ కేంద్రం పరిధి లో ప్రతి వారం లో ఒకసారైన సఖి బృందాల సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశాలకు వైద్యాధికారులు కూడా హాజరు కావాలని , బాలికల ఆరోగ్య సమస్యల పై చర్చించాలని అన్నారు. ఎర్లీ ప్రేగ్నన్సి వలన శరీరానికి కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని తెలిపారు.   సామ్, మాం పిల్లలు ఎక్కువగా ఉన్న కేంద్రాలను ఎక్కువ సార్లు సి.డి.పి.ఓ లు సందర్శించి వారికీ ప్రత్యెక ఆహారాన్ని ఎలా అందించాలో వారి తల్లులకు అవగాహన కలిగించాలన్నారు.  6 నెలలకే అన్నప్రాసన జరగాలని, గుడ్డు, పాలు, బాలామ్రుతం  పిల్లలకు అందజేయాలని తెలిపారు. ఈ విషం పై తల్లులకు అవగాహన కలిగించాలని తెలిపారు.  బాల్య వివాహాల నిరోధానికి పోలీస్ ల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. డా. నాగభూషణ రావు, ఐ.సి.డి.ఎస్. పి.డి. శాంత కుమారి, సి.డి.పి.ఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.