రైతులు తప్పకుండా ఈకేవైసీ చేయించాలి


Ens Balu
7
2022-10-14 11:52:29

మామిడి పంట వేసిన  రైతులు కూడా ఈ.కే.వై.సి చేయించాలని, లేని యెడల పంటల నష్ట పరిహారం, ఇన్సురెన్సు వర్తించవని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి స్పష్టం చేసారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్.బి.కే ల ద్వారా రైతులకు ఈకేవైసీపై అవగాహన కలిగించాలని  జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు కు సూచించారు. పశువులకు వాక్సినేషన్  లక్ష్యాలను పూర్తి చేయాలనీ జే.డి డా. రమణ కు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలో శత శాతం టాయిలెట్లు ఉండాలని , విద్యార్ధి, ఉపాధ్యాయుల నిష్పత్తి ఖచ్చితంగా ఉండేలా చూడాలని డి.ఈ.ఓ వెంకటేశ్వర రావుకు తెలిపారు. 

పి.ఎం.జి.ఎస్.వై క్రింద చేపడుతున్న రహదారుల పురోగతి పై సమీక్షించారు. 34 రహదారులకు గాను 15 పూర్తి అయ్యాయని, మిగిలినవి పలు దశల్లో ఉన్నాయని ఆర్ అండ్ బి  ఈ ఈ వెంకటేశ్వర రావు తెలుపగా మార్చ్ నెల లోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు.  మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి వనరులు ఉన్న ప్రతి రైతు 90 శాతం సబ్సిడీ పై ప్రభుత్వం అందిస్తున్న  డ్రిప్, స్ప్రింక్లర్ కొనుగోలు చేయాలనీ , అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలనీ ఏ.పి.ఎం.ఐ.పి ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కు సూచించారు.   జలజీవన్ మిషన్ క్రింద మంజూరైన ప్రాజెక్ట్ లకు వెంటనే టెండర్స్ పిలవాలని గ్రామీణ నేటి సరఫరా ఎస్.ఈ ఉమా శంకర్ కు సూచించారు. 

నీతి అయోగ్ సూచీలన్నీ శత శాతం సాధించాలని, ఏ ఒక్క శాఖ వెనుకబడినా జిల్లా వెనుకబడిపోతుందని స్పష్టం చేసారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. డా. నాగభూషణ రావు, ఐ.సి.డి.ఎస్. పి.డి. శాంత కుమారి, సి.డి.పి.ఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.