విశాఖ జిల్లాలో ప్లాస్టిక్ ను నిషేదించాల్సిందే..


Ens Balu
5
2022-10-14 13:35:25

విశాఖజిల్లాలో ప్లాస్టిక్ ను అధికారికంగా నిషేదించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రభుత్వం ఇచ్చిన (జి.ఓ.ఎమ్ఎస్.నెం.65, తేది:22.09.2022) ఆదేశాల ప్రకారం విశాఖపట్నం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేయాలన్నారు. దానికోసం  వచ్చే నెల 1వ తేదీ లక్ష్యంగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దానికోసం పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికి సూచించారు. ఈ సమావేశంలో కమీషనర్, జి.వి.ఎమ్,సి, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతి అధికారి, పర్యావరణ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మండలి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, డివిజన్ స్థాయి అభివృద్ధి  అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్, చేనేత, మండల పరిషత్ అభివృధి అధికారి, ఆనందపురం, భీమినిపట్నం, పెందుర్తి మరియు పద్మనాభం, చీఫ్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్,జి.వి.ఎమ్.సి మరియు ఫ్లెక్షి  అసోసియేషన్ కార్యదర్శి,  త్రినాధ్ రావు, మరియు అధ్యక్షుడు, లక్ష్మణ రావు, తదితరులు పాల్గొన్నారు.