తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు నంద కుమార్ శుక్రవారం సాయంత్రం సుమారు రూ. 27 లక్షలు విలువైన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విరాళంగా అందించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డికి తాళాలు అందజేశారు. టీటీడీ రవాణా విభాగం తిరుమల డీఐ జానకిరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.