నవంబరు1 నుంచి ప్లాస్టిక్ నిషేదం అమలు


Ens Balu
9
2022-10-14 15:28:41

పర్యావరణ శాఖ సూచనలు రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని..అందుకు అనుగుణంగా ఫ్లెక్సీ తయారుదారులు జిల్లాలో ఫ్లెక్సీ బ్యానర్ లు వినియోగం లేకుండా సహకరించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత కోరారు. శుక్రవారం రాత్రి  రాజమండ్రి కలెక్ట రేట్ లో జిల్లాలోని ఫ్లెక్సీ నిర్వాహకులతో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా ఒక ప్రత్యేకత ను సంతరించుకున్న ప్రాంతం అన్నారు. ఇక్కడ నుంచే ఎన్నో సంస్కరణలు జరిగాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్ ల వినియోగం పై బ్యాన్ నవంబర్ ఒకటి నుంచి నిషేదం అమలు నిర్ణయానికి కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు మీ సహకారం అందించాలన్నారు. అందుకోసం జిల్లా స్థాయి లో జిల్లా పంచాయతీ అధికారులు, పర్యావరణ శాఖ, ఎల్ డి ఎం, ఫ్లెక్సీ సభ్యులతో ద్వారా కమిటీ వేసి మీ సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ బ్యానర్ లకు ప్రత్యాన్మయ మార్గాలు చూపాలని, మానవ జీవితంలో మార్పు సహజం అని, ఆ మార్పు మనతోనే ప్రారంభిద్దామన్నారు. 

ఫ్లెక్సీ బోర్డులపై నిషేధం అమలు..

తమ గెజిట్‌లోని ఆంధ్రప్రదేశ్ గెజిట్ పబ్లికేషన్ నం. 1320 ప్రకారం, G.O.Ms.No.65, 1986 సెంట్రల్ యాక్ట్ 29 ఆఫ్ 1986 భారత ప్రభుత్వం, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ మేరకు ఫ్లెక్సీ బ్యానర్ వినియోగం పై నిషేదం అమలుకు నవంబర్ 
ఒకటి నుంచి అమలు చేయాల్సి ఉందన్నారు. అన్ని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచలు, విస్తరణ అధికారి,  డివిజనల్ పంచాయతీ అధికారులకు గ్రామ పంచాయతీలలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బోర్డులను ప్రదర్శించవద్దని,  ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు.  "రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీ మెటీరియల్‌ని తయారు చేయకూడదు మరియు దిగుమతి చేయకూడదు, రాష్ట్రంలో ఏ రకమైన ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లను ముద్రించకూడదని, ఉపయోగించకూడదని, రవాణా చేయకూడదు మరియు ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫ్లెక్స్ ప్రింటర్‌లకు మరింత సమాచారం అందించే క్రమంలో సమావేశం ఏర్పాటు చేశామని కలెక్టర్ మాధవీలత అన్నారు. 

 ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్‌లు  నిషేధం, వాటి స్థానం లో కాటన్ బ్యానర్ మెటీరియల్ లభ్యతను నిర్ధారించడం ద్వారా పరిశ్రమలు,  వాణిజ్య శాఖ , బ్యాంకు అధికారుల ముందు విషయాన్ని ఉంచాలని ఉద్దేశ్యం, ఫ్లెక్సీ వ్యాపారుల ప్రత్యామ్నాయ మెటీరియల్ కోసం మార్గాలు కోసం  ఆదేశాలు జారీ చేసే విధానం లో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీ బ్యానర్ ప్రతినిధులు బి. రాధాకృష్ణ, పి. భద్రరావు, తదితరులు తమ వద్ద స్టాక్ నిలవ ఉందని, బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నందున, వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందని,  పేర్కొన్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని, బ్యాంకర్ల నుంచి వాయిదా కోసం వత్తిడి లేకుండా తదుపరి ప్రతిపాదన అమలు చేసే వరకు మినహాయింపు కి చేయూత నిచ్చి అదుకోవాలని కోరారు.