ప్రపంచానికే మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ స్పూర్తి


Ens Balu
8
2022-10-15 07:25:28

ప్రపంచానికే స్పూర్తినందించిన మహనీయులు భారతరత్న అబ్దుల్ కలామ్ అని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బరాటం శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలోని గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో  అబ్దుల్ కలాం 91వ జయంతి వేడుకలు జరిగాయి.  కలామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంతో ఉన్నత స్థితికి వెళ్లినా నిరాడంబరంగా జీవించడంతో పాటు మిసైల్ మ్యాన్గా కలాం పేరుగాంచారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టి మిసైల్ మేన్ గా కీర్తిపొందారని కొనియాడారు. విగ్రహదాత బరాటం లక్ష్మణరావు, గాంధీ మందిరం నిర్వాహకులు జామి భీమశంకర్, నటుకుల మోహన్ తదితరులు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారతదేశాన్ని నిలబెట్టాలనే ఆకాంక్షతో దేశ ప్రజల్లో చైతన్యాన్ని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని కలాం నింపారన్నారు. 

జీవితాంతం యువతకు దేశభక్తిని బోధిస్తూనే ముందుకుసాగిన కలాం వ్యక్తిత్వం స్పూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా వ్యవస్థాపకులు మందపల్లి రామకృష్ణారావు రచించిన మహా మనీషి అబ్దుల్ కలామ్ పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. అనంతరం ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్శిటీలో బిబిఏ విభాగంలో యూనివర్శిటీ టాపర్ ఎన్ని నాగమణి, బీకాం విభాగంలో ఆర్ట్స్ కళాశాల టాపర్ పైడి ఉషారాణిలను శాలువతా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ నిర్వాహక బృందం మెట్ట అనంతంభట్లు, పొన్నాడ రవికుమార్, పందిరి అప్పారావు, నక్క శంకరరావు, తర్లాడ అప్పలనాయుడు, బరాటం చైతన్య తదితరులు పాల్గొన్నారు.