జగనన్న పచ్చతోరణం లక్ష్యాలను పూర్తిచేయాలి..
Ens Balu
3
Vizianagaram
2020-09-22 18:31:06
జగనన్న పచ్చతోరణం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని వివిధ ప్రభుత్వ శాఖలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఆయా శాఖాధిపతులు కృషి చేయాలని కోరారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రగతిపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ పచ్చతోరణం కార్యక్రమం అమల్లో కొన్ని శాఖలు వెనుకబడి ఉండటం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాటర్ రీసోర్సు సూపరింటిండెంట్ ఇంజనీర్, మైన్స్ అండ్ జియాలజీ, మెడికల్ అండ్ హెల్త్, సోషల్ వెల్ఫేర్ శాఖలు సున్నా ప్రగతిలో ఉన్నారని చెప్పారు. మున్సిపాల్టీలు 9.32 శాతం, దేవాదాయశాఖ 14శాతం మాత్రమే లక్ష్యాలను సాధించారని చెప్పారు. గృహనిర్మాణశాఖకు 2.50లక్షల మొక్కలు లక్ష్యం కేటాయించగా, ఇప్పటివరకు కేవలం 40వేలు మాత్రమే చేశారని, వెంటనే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా అటవీశాఖ (టెరిటోరి యల్) కేవలం 19శాతం, పరిశ్రమలశాఖ 25శాతం, ఈ శాఖలన్నీ తమ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. జిల్లా పరిషత్ 26శాతం మాత్రమే సాధించారని, పంచాయితీరాజ్ శాఖ అధికారులకు వెంటనే ఉత్తర్వులు జారీ చేసి, లక్ష్యాన్ని పూర్తి చేసేలా చూడాలన్నారు.
కాలుష్య నివారణా సంస్థ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు కూడా మిగిలిన తమ లక్ష్యాలకు చేరువ కావాలని సూచించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులంతా ఈ నెలాఖరుకు తమకిచ్చిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే మొక్కలు నాటించినట్లయితే, వాటిని వెంటనే అప్‌లోడ్ చేయాలని సూచించారు. మరో వారం రోజుల తరువాత ఈ అంశంపై సమీక్షించడం జరుగుతుందని, ఈ నెలాఖరుకు ప్రతీఒక్క విభాగమూ తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.