మన్యం జిల్లా కేంద్రంలో గంట స్తంభం


Ens Balu
5
2022-10-15 09:06:29

పార్వతీపురం మన్యంలో గంట స్తంభం నిర్మించేందుకు యోచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. పార్వతీపురం పట్టణంలో స్థల గుర్తింపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గంట స్తంభం నిర్మాణానికి పట్టణ, జిల్లా ప్రజలు మంచి సూచనలు, సలహాలు అందించాలని దానితోపాటు మంచి నమూనాలు (డిజైన్) 10 రోజుల్లో ఇవ్వాలని కోరారు. త్వరలో స్థలం నిర్ణయించి మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. జిల్లా ఏర్పడి ఏడాది పూర్తి అయ్యే నాటికి సిద్ధం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.  అంతేకాకుండా ఆహ్లాదంగా నీటి వసతులు ఉండేలా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని విధాలా రక్షణ కవచంగా ఉపయోగపడే చెరువులను ఆహ్లాదంగా తయారు చేయుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. చెరువు గట్లపై వాకింగ్ ట్రాక్, విశ్రాంతి తీసుకొనుటకు బెంచీలు వంటివి ఏర్పాటు యోచన ఉందని ఆయన తెలిపారు.