శ్రీకాకుళంజిల్లాలో ధాన్యం సేకరణలో దళారుల నుండి రైతులను కాపాడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ స్పష్టం చేశారు. నూతన విధానం ద్వారే ధాన్యం సేకరించాలని ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం సేకరణ పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శత శాతం ఈ క్రాప్ చేసుకున్న రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొన్ని మండలాల్లో చేయని ఈ క్రాప్, ఈకెవైసిలను త్వరితగతిన చేయించేందుకు ఆర్డీఓలు వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏ మండలాల్లో అయితే ఈ క్రాప్ ఈకెవైసి పూర్తి చేయకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులదే బాధ్యతన్నారు. సచివాలయం, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బస్తాలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా గోనెసంచులు ఏర్పాటు చేసుకుంటే వారికి నగదు ఇస్తామని తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని రవాణాకు అంతరాయం లేకుండా చూడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఏ సమస్య లేకుండా చూడాలన్నారు. వే బ్రిడ్జి నుండి ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం తీయించేటప్పుడు ఒక్క గ్రాము కూడా తేడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవో లు ధాన్యం సేకరణ ఏర్పాట్లు పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు, విఆర్ఓలు, మిల్లర్లుకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు ఆర్డీఓ శాంతి వివరించారు. ఏ ఏ ప్రాంతాల నుండి ధాన్యం వస్తాయని పలాస ఆర్డీఓ ను జెసి అడుగుగా డివిజన్ కు ఒరిస్సా బోర్డర్ ఉందని ఒరిస్సా నుంచి ధాన్యం తరలి రాకుండా తగు చర్యలు చేపట్టి చెప్పారు.
ఏ ఏ మండలాల నుండి వచ్చినదీ ఆర్డీవో సీతారామమూర్తి వివరించారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో పబ్లిసిటీ చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ ను ఆదేశించారు. ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. 371 కేంద్రాలు ఇచ్చినట్లు జడ్పీ సీఈవో వెంకటరామన్ చెప్పారు. వాలంటీర్లకు వర్చ్యువల్ గా శిక్షణ ఇవ్వడమైనదని, ఫిజికల్ గా శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. భారత ఆహార సంస్థ అధికారి ధాన్యం నిల్వ కేంద్రాలపై జెసికి వివరించారు. ఆర్టీవో గంగాధర్ రవాణా వాహనాలు పై తెలియజేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూం కలెక్టరేట్ లో ఉంటుందన్నారు. ధాన్యం సేకరణలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతి ధ్యానం సేకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బి. శాంతి, సీతారామమూర్తి, జడ్పీ సీఈవో వెంకటరామన్, డిపిఓ రవి కుమార్, డిఎం జయంతి, డిఎస్ఓ వెంకటరమణ, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, డిఎంలు, లీగల్ మెట్రాలజి అధికారులు, కోపరేటివ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.