చేతుల పరిశుభ్రతతో.. వ్యాధులను పారద్రోలుదాం


Ens Balu
8
2022-10-15 11:07:54

 చేతులను తరచూ శుభ్రం చేసి వ్యాధులను పారద్రోలుదామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు పిలుపునిచ్చారు. చేతులు శుభ్రం చేసుకునే ప్రపంచ దినోత్సవాన్ని జిల్లా ఆసుపత్రిలో శని వారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ చేతులు శుభ్రం చేసుకోవడం ఆవస్యం అన్నారు. క్రిములు, కీటకాలు చేతులకు అంటుకుంటాయని, చేతులు శుభ్రం చేయకుండా ఆహారం తీసుకోవడం వలన క్రిములు, కీటకాలు కడుపులోకి వెళ్ళి రోగాలకు కారణం అవుతుందని అన్నారు. కరోనా సమయంలో చేతుల శుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగిందని, దానిని కొనసాగించాలని కోరారు. చేతులు శుభ్రం చేయకపోవడం వలన కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా బి.వాగ్దేవి, తదితరులు పాల్గొన్నారు.